

జనం న్యూస్ 17 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గుర్ల మండలంలో పలువురు అధికారులను గుర్తు తెలియని ఓ నకిలీ ఏసీబీ అధికారి హడలెత్తించినట్లు సమాచారం. తాను ఏసీబీ DSPని అంటూ పరిచయం చేసుకొని డబ్బులు డిమాండ్ చేశాడు. పలువురు అధికారులకు ఆదివారం ఫోన్ చేసి మీరు అవినీతికి పాల్పడుతున్నారని, అరెస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగాడు. రూ.2లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని గుర్ల SI నారాయణరావు తెలిపారు.