

జనం న్యూస్ 13.1.2025
మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు
మెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం
నార్సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్ హఠాత్తుగా మరణించడం జరిగింది. ఈ నార్సింగ్ మండల కేంద్రంలో వారి స్వగృహం నందు ఆకుల శ్రీనివాస్ గౌడ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలిపిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆకుల శ్రీనివాస్ గౌడ్ పార్థివ దేహ పై కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పి అంతిమ యాత్ర లో పాల్గొని అమర్ హే ఆకుల శ్రీనివాస్ అమర్ హే అమర్ హే నినాదాలతో అంతిమ యాత్రలో పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ సోదరుడిగా 25 సంవత్సరాల నుండి నాకు ఏళ్ల వేళలా తోడుగా ఉన్న ఆత్మీయుని కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు, పార్టీకి తీరనిలోటని తెలిపారు. వారి మరణం నార్సింగ్ మండలం ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు తీరని లోటని తెలిపారు.వారి కుటుంబానికి ఎప్పుడు తోడుగా ఉంటానని తెలిపారు. అంతిమ యాత్రలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, PACS చైర్మన్లు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచ్లు, అన్ని మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు