

జనం న్యూస్ 17 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఖాళీ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై విజయనగరం జిల్లా పోలీసులు దృష్టి సారించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో నిఘా పెట్టి వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఆదివారం సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం శివారులో బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై రాజాం పోలీసులు దాడులు చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఆరుగురు మందుబాబులపై కేసు నమోదు చేశారు.