Listen to this article

జనం న్యూస్ మార్చి 18(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల కేంద్రంలోని ప్రజ్ఞ హైస్కూల్లో సోమవారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు బాల్యంలో పాటించిన క్రమశిక్షణ మీదనే ఆధారపడి ఉంటుంది అన్నారు. విద్యార్థులు మంచి లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే చదువు ద్వారానే సర్వం సాధ్యమవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వివిధ పాత్రలను చక్కగా పోషించారు.సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కీర్తి రెడ్డి, విద్యాశాఖ మంత్రిగా చరణ్ తేజ,జిల్లా కలెక్టర్ గా మున్ని మేఘన, శాసనసభ్యులుగా పవన్, జిల్లా విద్యాశాఖ అధికారిగా వాగ్దేవి రెడ్డి, తహసీల్దారుగా హర్షద్, మండల విద్యాధికారిగా వినీతారెడ్డి,ఎంపీడీవో గా రోహిత్ తదితరులు తమ పాత్రలను చక్కగా పోషించారు. అనంతరము విజేతలకు బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా సహకరించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు