Listen to this article

గొప్ప మనసును చాటుకున్న గండ్రపల్లి సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు గాదె ప్రభాకర్.. జనం న్యూస్ // మార్చ్ // 18 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామం లో గండ్రపల్లి సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఊరికి… ఉపకారి..! తన కున్నంతలో మరొకరికి సహాయం, అలాగే ఆపదలో ఆదుకునే గుణం, పేదల పక్షాన బిసి బిడ్డ, తాత లాంటి ఆస్తులు లేవు, అమ్మానాన్న సంపాదించింది ఇవ్వకున్నా, తాను సంపాదించిన, తనకున్నంత ఎంతో కొంత సాయం చేసే గొప్ప మనుసు తో పేదలకు సాయం చేయాలని ఆదర్శంగా నిలుస్తున్న గాదె ప్రభాకర్ పటేల్, సేవే లక్ష్యంగా, గ్రామం లో ఇటీవల మాదారపు రాజేశ్వరరావు , తల్లి రాధమ్మ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. గండ్ర పల్లి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాదె ప్రభాకర్ పటేల్, వాళ్ళ కుటుంబానికి ( 50 ) కిలో బియ్యం అందజేశారు. అలాగే గండ్రపల్లి శాశ్వత ఫౌండర్ పుల్లయ్య, లింగారావు (2,000 ) ఇవ్వడం జరిగింది. రాజేశ్వరరావుకు తల్లి మరణం పట్ల ఆ భగవంతుడు అండ ఉండాలని కోరుకుంటూన్నామని, ప్రజా సేవకుడు, గండ్రపల్లి సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు గాదె ప్రభాకర్ తెలిపారు.