

———మాజి సియం వైయస్ జగన్ పై మంత్రి సవితమ్మ ఫైర్
——–బడుగు,బలహీన వర్గాల ద్రోహి జగన్
జనం న్యూస్ జనవరి 13 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం తిప్పరాజు పల్లి గ్రామంలో గోకులం షెడ్ ను ప్రారంభించిన మంత్రి సవితమ్మ .అనంతరం ఎర్రయ్య గారి పల్లి గ్రామం నుండి మేరెడ్డి పల్లి గ్రామం వరకు 1 కోటి 14 లక్షల రూపాయల నిధులతో పూర్తి చేసిన బీటీ రోడ్డు ను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన మంత్రి సవితమ్మ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శవ రాజకీయాలు చేసి,శవం దగ్గర కూడా నవ్వే జగన్ కి ,చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు లేదని జగన్ పై మంత్రి సవితమ్మ ఫైర్ అయ్యారు.రాష్ట్ర వ్యాప్తంగ నేడు గోకులాలు ప్రారంభించాం, సంక్షేమంతో పాటు పశువుల క్షేమం కూడా ఆలోచిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ,తిరుమలలో పొరపాటున జరగరానిది జరిగితే దాని మీద ఇంత రాజకీయం చేయాలా అంటూ జగన్ పై మండిపడ్డారు.జగన్ కు 5 సంవత్సరాల్లో ప్రజల పై లేని ప్రేమ,ఈ ఆరు నెలల్లో వచ్చిందివైసిపి హయంలో గతుకులు,గుంతల మయం అయ్యిన రోడ్లు ,నేడు నూతన రోడ్లతో స్వర్ణాంధ్ర వైపు ఆంధ్రప్రదేశ్ పరుగులు తీస్తోందని అన్నారు. ,ఐరన్ లెగ్ అయిన జగన్ ను ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసారు,అయిన జగన్ కు బుధ్ధి రాలేద అంటూ మండిపడ్డ మంత్రి సవితమ్మ..
నాడు మీ పాలన,మీ అభివృధ్ధి చూసాం,నేడు కూటమి ప్రభుత్వ అభివృధ్ధి,సంక్షేమం రాష్ట్రం తో పాటు ప్రపంచం కూడా చూస్తోందిని అనవసర మాటలు మాట్లాడటం మానేసి,ఇప్పటికైన బుధ్ధి తెచ్చుకోండి అంటూ పులివెందుల ఎమ్మెల్యే జగన్ , వైసిపి నాయకులపై ఫైర్ అయ్యిన రాష్ట్ర బిసీ సంక్షేమం,చేనేత,జౌళి శాఖా మంత్రి సవితమ్మ… ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..