

▪️ ఏ ఒక్క గ్రామానికైనా పూర్తిస్థాయిలో రుణమాఫీ జరుగుతే రాజీనామాకు సిద్ధం.. ▪️హుజురాబాద్ అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించండి. ▪️అసెంబ్లీ సమావేశాల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. జనం న్యూస్ // మార్చ్ // 18 // జమ్మికుంట// కుమార్ యాదవ్.. హుజురాబాద్ నియోజకవర్గం లోని చివరి ఆయకట్ట ఉన్న గ్రామాలకు సాగు కోసం నీళ్లు అందించాలని దండం పెట్టి అడుగుతున్నానని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఉద్దేశించి మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలోని శ్రీరాములపల్లి, అంబాల, శనిగరం, గూనిపర్తి, మాదన్నపేట్, లక్ష్మీపూర్, గోపాల్పూర్, బద్వాన్పల్లికి నీళ్లు రాక వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని అన్నారు. చివరి ఆయకట్ట గ్రామాలకు వెంటనే నీళ్లు అందించాలని అనేకసార్లు ఇరిగేషన్ సి.ఈ, డీ. ఈ తో మాట్లాడిన ప్రయోజనం లేదని అన్నారు. దయచేసి డిబిఎం 21, 22, 23, 24 ద్వారా వెంటనే ఈ ప్రాంతాలకు నీళ్లు అందించాలని ఆయన అన్నారు. అదేవిధంగా డిబీఎం జమ్మికుంట మండలంలోని వావిలాల నగురం, నాగారం, తోపాటు ఇల్లంతకుంట మండలం బూజునూరు సీతంపేట పాతర్ల పెళ్లి మరువను పెళ్లి భోగం పాడుకు నీళ్లు అందడం లేదని, 29 ఎల్ ద్వారా వెంటనే ఈ గ్రామాలకు కూడా నీళ్లు అందించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. కల్వల ప్రాజెక్టు కింద 6,7 వేల ఎకరాల ఆయకట్టు వీణవంక మండలం కు వస్తదని దానికి డిపిఆర్ కూడా రెడీ చేసి ఉందన్నారు . ఇట్టి విషయంలో ప్రాజెక్టు కట్టమని ఇరిగేషన్ మంత్రికి కూడా విన్నవించుకోవడం జరిగిందని, గత అసెంబ్లీలో చెప్పి సంవత్సరం గడిచిన ఇప్పటివరకు దానిపై స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ఇటీవల స్టేషన్ ఘన్పూర్ కు ముఖ్యమంత్రి 800 కోట్లు కేటాయించారని అదేవిధంగా హుజరాబాద్ అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించాలని అన్నారు. ప్రతి ఎమ్మెల్యేకు మనసులో ఇదే ఉందని, దీనిపై దృష్టి సారించి అన్ని నియోజకవర్గాలకు 1000 కోట్లు ఇవ్వాలని అన్నారు. డిప్యూటీ సీఎం ఇటీవల హుజురాబాద్ కు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తామన్నారు, ఇప్పటివరకు చేయలేదని గుర్తు చేశారు. రుణమాఫీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి పదేపదే మాట్లాడుతున్నారని, హుజురాబాద్ నియోజకవర్గం లోని 107 గ్రామాల్లో ఏ గ్రామానికైనా 100% రుణమాఫీ అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
