Listen to this article


జనం న్యూస్ 19మర్చి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దేవికొండ గ్రామంలో మైసమ్మ ఆలయం కు ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ప్రతిపాదనలతో సీసీ రోడ్డు ప్రారంభించారు. సిసి,రోడ్డు నిర్మాణం చేయడానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా విడుదలైన 10 లక్షల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది. ఈనిధులను విడుదల చేసి మైసమ్మ ఆలయం వద్ద సిసి రోడ్ నిర్మాణానికి కృషి చేసిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కి దేవి కొండగ్రామ ప్రజలు మరియు కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ఎంపీ ఓ మహేందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్,ప్రధాన కార్యదర్శి గోగూరు సత్తిరెడ్డి, ఉపాధ్యక్షులు సంది మల్లారెడ్డి నాయకులు కడారి తిరుపతి స్థానిక గ్రామ గ్రామ శాఖ అధ్యక్షులు బైరి రాజు ఆలయ కమిటీ చైర్మన్ లైసెట్టి శంకరయ్య నాయకులు ఎడ్ల రాజయ్య సద్వాల శ్రీనివాస్ లైసెట్టి తిరుపతి,మనోహర్ ఎడ్ల నర్సిరెడ్డి గాజుల నగేష్ కృష్ణ పలువురు నాయకులు పాల్గొన్నారు