Listen to this article

జనంన్యూస్. 18. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు జిల్లా సమస్యలపై అసెంబ్లీలో గళం ఎత్తిన అర్బన్ ఎమ్మెల్యే. అసెంబ్లీ సమావేశంలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ సూర్యనారాయణ.జిల్లా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు.
నిజామాబాదు అర్బన్ నియోజకవర్గం నుండి దాదాపు 50,000 మంది ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దసరా, దీపావళి, సంక్రాతి పండుగల పేర్లు చెప్తూ కాలం గడుపుతుందని అన్నారు పేపర్ ప్రకటనలకు కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తూ ప్రకటనాలకే పరిమితం అవుతుందని అన్నారు. అర్బన్ నియోజకవర్గంలో స్థలం లేని లబ్ధిదారులు వేల సంఖ్యలో ఉన్నారని ప్రభుత్వం తక్షణమే మొదటి విడుతలోనే వారికీ ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేసారు.
అలాగే నాగారంలో 396 కలెక్టర్ బైపాస్ లో 252 డబుల్ బెడ్రూం ఇల్లులు కట్టి గత ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వకుండా వదిలేశారని అవి ప్రస్తుతం శితిలావస్థలో ఉన్నాయని అన్నారు వాటి మరమ్మత్తులకై గతంలో ప్రభుత్వానికి వినతి చేసేటప్పుడు, ఈ ఇళ్ల మరమ్మతు పనులకు 1.25 కోట్లు మంజూరయ్యాయని ఆవి నామ మంత్రం పనులకే సరిపోతాయని పూర్తి స్థాయి లో పనులు అవ్వడానికి మరో 3 నుండి 4 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని వాటిని వెంటనే విధుల చేస్తే వచ్చే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కల్లా అర్హులకు అందించలని డిమాండ్ చేసారు. యావత్ తెలంగాణ ఆడబిడ్డల ఆశలు ఆశలు గానే మిగిలిపోకుండా ఉండాలంటే తక్షణమే ప్రభుత్వం పూర్తిస్థాయి లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పడి నుండి ప్రారంబిస్తారో ఎప్పుడు నూతన గృహాలకు శంకుస్థాపన చేస్తారో, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పెండింగ్ లో ఉన్నా ఇళ్ల పంపిణి ఎప్పడికల్లా చేస్తారో సమాధానం చెప్పాలన్నారు. మంత్రి ఆవాస్ యోజన పథకం కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు ఇవ్వాలనుకుంటుందా? లేక మొత్తం ఐదు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందో స్పష్టం చేయాలన్నారు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా కలుపుకొని ఇస్తే ప్రకటనల్లో మరియు పథకంలో ప్రధానమంత్రి ఫోటో కూడా పెట్టాలని డిమాండ్ చేసారు. తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఏర్పడ్డ తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ లో మహిళలకు 800 మందికి ఒకటే హాస్టల్ ఉంది అధ్యక్షా , ఒక రూమ్ కి 8 నుండి 10 విద్యార్థినిలు ఉంటున్నారు, దీని వల్ల వారికి హాస్టల్ లో రూములు సరిపోక మరియు చదువుకోవడానికి బాగా ఇబ్బంది అవుతుందని అన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మహిళలకు మరొక నూతన గర్ల్స్ హాస్టల్ నిర్మించ వలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీ లలో ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి కానీ ఒక తెలంగాణ యూనివర్సిటీలో మాత్రమే లేదని తెలంగాణ యూనివర్సిటీ కి కూడా ప్రభుత్వం తక్షణమే ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయవలసిందిగా డిమాండ్.
నిజామాబాదు జిల్లా కేంద్రం బస్సు స్టేషన్ దారుణమైన పరిస్థిథి ఉందని,ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవని బస్సు స్టాండ్ అభివృద్ధికి తక్షణమే చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
నిజామాబాదు బస్సు స్టాండ్ రెన్నొవేషన్ వర్క్ అండ్ అప్ గ్రేడేషన్ కు కూడా నిధులు ఇవ్వ వలసిందిగా సంబంధిత మంత్రి ని కోరారు. రెన్నోవేషన్ లో భాగంగా వెయిటింగ్ ఏరియాస్, అధునాతన పార్కింగ్ వ్యవస్థ, సీసీ టీవీ, డిజిటల్ డిస్ప్లే బోర్డ్స్, బయో డిగ్రేడబుల్ టాయిలెట్స్ వంటి ముఖ్య మైన మౌలిక సదుపాయాలతో అప్ గ్రేడేషన్ కు కావాల్సిన నిధులు విడుదల చేయవలసిందిగా డిమాండ్ చేసారు. నిజామాబాద్ ఐటీ హబ్‌ని భారీ ప్రాజెక్టుగా ప్రకటించి, వేలాది ఉద్యోగాలు వస్తాయని మాయమాటలు చెప్పిన బి ఆర్ఎస్ ప్రభుత్వ విఫలత ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు, ఆగస్టు 9, 2023న, మాజీ ఐటీ మంత్రి కే టీ రామారావు చేతుల మీదుగా ఐటీ హబ్‌ను ప్రారంభించినప్పటికీ, అది కేవలం పబ్లిసిటీ స్టంట్‌గానే మిగిలిపోయిందని అన్నారు 600 మంది ఉద్యోగులకు అవసరమైన వసతులు ఉన్నా కేవలం 9 కంపెనీలే పనిచేస్తున్నాయని దానికి కారణం బి ఆర్ ఎస్ హయాంలో మోసం కాంగ్రెస్ హయాంలో నిర్లక్ష్యం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హనీమూన్ పీరియడ్ అయిపోయింది ఇప్పడికైనా సీరియస్ గా తెలంగాణ యువతకు మరి ముక్యంగా ఇందూరు జిల్లా బిడ్డలకు ఉపాధి అవకాశ కల్పన పైన ద్రుష్టి సారించవలసిందిగా సూచించారు. ఐటీ హబ్ అభివృద్ధికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.టియర్ 1 & టియర్ 2 కంపెనీలను స్థాపించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు
ఐటీ హబ్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలన్నారు ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నారు. నిజామాబాదు ను తెలంగాణ ఐటీ ఎక్సపెన్షన్ హబ్ గా మార్చవలసింది గా కోరారు. ప్రతి నియోజకవర్గానికి సమానమైన నిధులు ఇవ్వాలని డిమాండ్ చేసారు. బి ఆర్ ఎస్. లో ఎస్ డి ఎఫ్ నిధులు – సిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేట నియోజకవర్గాలకు మాత్రమే! పోయాయాని కాంగ్రెస్ ప్రభుత్వంలో కొడంగల్, ఇతర ముఖ్య శాఖ మంత్రుల నియోజకవర్గాలకే వేల కోట్లు! వెళ్తున్నాయి అన్నారు ఈ ధోరణి మారాలని విజ్ఞప్తి చేసారు .తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సమానంగా ఎస్ డి ఎఫ్ నిధులు కేటాయింపులు జరగాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఎస్ డి ఎఫ్ కింద రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల అభివృద్ధికి సమంగా నిధులు కేటాయించాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలను కూడా సమానంగా చూడాలి. ప్రజా ధనాన్ని ఒకరికి తగ్గించి మరొకరికి పెంచే రాజకీయాలు మానుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి నియోజకవర్గానికి సమాన నిధులు కేటాయించకపోతే బంగారు తెలంగాణ ఎలా సాధ్యం, అవుతుందని ప్రశ్నించారు.మనం ప్రత్యక రాష్ట్రం సాధించుకుంది బంగారు కొడంగల్ కోసమో? బంగారు గజ్వేల్ కోసమో? బంగారు సిద్ధిపేట కోసమో?
బంగారు సిరిసిల్ల కోసమో? కాదని తెలంగాణ లో ఉన్న అన్ని జిల్లాల బంగారు భవిషత్తు కోసం రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం అని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తే ప్రతి నియోజకవర్గానికి సమానంగా నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.