

జనంన్యూస్. 18. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బిసి బిల్లు ఆమోదించబడిన సందర్భముగా. బీసీల అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి నరేష్ తెలిపారు . బీసీలకు 42% రిజర్వేషన్లను ప్రతిపాదిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం సభలో బిల్లు ఆమోదం పొందడం చరిత్రత్మక మనీ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్సీ ఆర్కల నర్సారెడ్డి పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి నరేష్ వివరించారు బీసీలకు మద్దతుగా కాంగ్రెస్ ఉందని చెప్పడానికి రిజర్వేషన్ల పెంపే నిదర్శనమని పేర్కొన్నారు కామారెడ్డి డిక్లరేషన్ను విజయవంతంగా అమలు చేశారని పేర్కొన్నారు దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వమే కులగనన సర్వే చేసిందని చెప్పారు సర్వే వివరాల ఆధారంగా రిజర్వేషన్ కల్పించడం సంతోషకరమన్నారు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లును శాసనా సభకు ఏకగ్రీవంగా ఆమోదించడంపై హర్షణ వ్యక్తం చేశారు ఇది తెలంగాణ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలకనుందని బండారి నరేష్ పేర్కొన్నారు బీసీ లందరూ ప్రజా ప్రభుత్వాన్ని గౌరవించాలని వొన్ చేసుకోవాలని కోరారు బీసీ రిజర్వేషన్లు అమలుపై బీసీ బిడ్డలందరూ సంబరాలు చేసుకోవాలని అన్నారు.