Listen to this article

జనం న్యూస్ మార్చి 18 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి స్నేహపురి కాలనీ సంక్షేమ సంఘం నూతన కమిటీకి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్
స్నేహపురి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన వినోద్ యాదవ్ మరియు అసోసియేషన్ సభ్యులు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ని మరియు మూసాపేట్ మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరియు మాజీ కార్పోరేటర్ వారిని శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ స్నేహపరి కాలనీ వాసులకు ఓపెన్ నాళా సమస్య నుండి విముక్తి కల్పించామని కొత్తగా వచ్చిన కమిటీ కాలనీ అభివృద్ధి కొరకు మరింత పాటు పడాలని అందుకోసం ఎప్పటి లాగానే తమవంతు కృషి చేస్తామని తెలిపారు
కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ వెంకటేశ్వర్ రెడ్డి చలమా రెడ్డి శ్రీనివాస్ దశరథ్ రాము నారాయణ రావు ముస్తక్ వసీం దిలీప్ తదితరులు పాల్గొన్నారు