Listen to this article

జనం న్యూస్ మార్చి(18) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో మంగళవారం నాడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం మద్దిరాల మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రజాక్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి ఈనెల 20వ తేదీన సూర్యాపేట జిల్లా పార్టీ కార్యంలో జరిగే బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తునందున ఈ సమావేశానికి మండలం నుండి ముఖ్య నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ శ్రీరామ్ రెడ్డి సర్పంచ్ ల ఫోరం మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, దామెర్ల వెంకన్న, మధు, యాకయ్య, లింగారెడ్డి, రేసు వెంకన్న, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి