

జనం న్యూస్ మార్చి 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టిబి ముక్తుభారత అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా పిఓడిటి ఆఫీసర్ డాక్టర్ శ్రీశైలం యాదవ్,రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వినయ్ ఆధ్వర్యంలో 11 క్షయ వ్యాధితో బాధపడుతున్న వారికి ఆరు నెలలకు సరిపోను ఫుడ్ బాస్కెట్ అందజేశారు. బ్రూస్ ఎన్జీవో ఫౌండేషన్ వారు స్వచ్ఛందంగా ఇచ్చిన వేరుశనగలు పప్పు బియ్యం ఆయిల్ ప్యాకెట్స్ కలిగిన ఫుడ్ కిడ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి బి భాస్కర్ రాజు, స్టాఫ్ నర్స్ సునీత, ల్యాబ్ టెక్నీషియన్ ఫణీంద్ర, ఏఎన్ఎం బి పద్మ ,హెల్త్ అసిస్టెంట్ లింగయ్య, ఫార్మసిస్ట్,శాంతయ్య పాల్గొన్నారు.