Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నిరుపేదల ముఖాలపై చిరునవ్వు మా లక్ష్యం అని నందలూరు మండల మైనారిటీ నాయకులు షేక్ మౌలా, పటాన్ మెహర్ ఖాన్ లు అన్నారు. మంగళవారం నందలూరు మండలంలోని నందలూరు పంచాయతీ పరిధిలోని మస్జిద్ వీధి, ఆడపూరు గ్రామంలో అదేవిధంగా మందపల్లి గ్రామంలోని పీర్ల కొట్టం వద్ద ముస్లిం మైనారిటీలకు ఆ ప్రాంతంలోని స్థానికుల సమాచారం మేరకు నిరుపేదలకు15 మందికి రంజాన్ తోఫా ను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం కుటుంబం రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని నిరుపేదల ముఖాలలో సంతోషం వెల్లువిరవాలని ఉద్దేశంతో ఈ రంజాన్ తోఫా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. నందలూరు మండలంలో ప్రతి ముస్లిం కుటుంబంతోపాటు పేద, ధనిక విభేదాలు లేకుండా అందరూ సంతోషంగా రంజాన్ పండుగను జరుపుకోవాలని తమ ఉద్దేశమని అన్నారు. ఇదేవిధంగా మండలంలోని ప్రతి పల్లెలో రంజాన్ తోఫా కార్యక్రమాన్ని పూర్తి చేసి రంజాన్ పండుగను అందరూ సంతోషంగా జరుపు కునేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు అదేవిధంగా తమ స్నేహితులు, బంధువులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, పార్టీలకతీతంగా నాయకుల సహాయ సహకారాలతో మండలంలోని ప్రతి పల్లెలో పేద కుటుంబాలను ఎంపిక చేసి వారికి పండుగకు కావాల్సినటువంటి 15 రకాల సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. Phone pay number షేక్. మౌల 8125694757, పటాన్ మెహర్ ఖాన్ 7396500319.