

జనం న్యూస్ 19 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త అయిన శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారి ద్వితీయ పుత్రుడు మజ్జి ప్రణీత్ బాబు 14/05/2020 వ తేదీన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం అందరికీ తెలిసినదే… అయితే ఈ నాలుగు సంవత్సరాల 10 నెలలు పాటు మృత్యువుతో పోరాడి చివరికి ఈరోజు విశాఖపట్నంలో ఉన్న స్టార్ పినాకిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని తెలియజేయుటకు చింతిస్తున్నాము….