

జనం న్యూస్ 19 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణంలోని తోటపాలెం ఓ అపార్ట్మెంట్పై టాస్క్ ఫోర్స్ సీఐ బంగారు పాప ఆధ్వర్యంలో మంగళవారం దాడులు చేపట్టారు. అపార్ట్మెంట్లోని ఓ ఇంట్లో పేకాట స్థావరం పై దాడి చేసి ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1,04,670, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో వన్ టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గ్న్నారు.