Listen to this article

జనం న్యూస్, మార్చి 20,( పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) ఈరోజు కల్వచర్ల గ్రామ పరిధిలోని గోకుల్ నగర్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దుదిళ్ళ శ్రీధర్ బాబు ని హైదరాబాద్ లో కలిసి కల్వచర్ల గ్రామంలో సుమారు 200 యాదవుల కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, గతంలో నిర్మించిన కుల సంఘం గదులు శిథిలావస్థకు చేరడం మరియు ప్రస్తుత జనాభా పెరుగుదల వల్ల దానిని వినియోగించలేకపోతున్నాము అని తెలుపుతూ కుల సంఘం ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డుకు ఉన్న భూమిలో మిని ఫంక్షన్ హాల్ నిర్మించుకోవడానికి ప్రత్యేక చొరవ చూపి ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయాలని యాదవ సంఘం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరియు సెంటినరీ కాలనీ లో మేకల మార్కెట్ లో జీవనోపాధి పొందుతున్న వారు ప్రస్తుతం ఉన్న స్థలంలోనే రేకుల షెడ్ వేసుకోవడానికి అనుమతులు ఇప్పించాలని శ్రీ రామాంజనేయ మేకల మార్కెట్ వారు విన్నవించగా మంత్రివర్యులు దుదిళ్ళ శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందిస్తూ అర్జీ -3 జనరల్ మేనేజర్ తో మాట్లాడటం జరిగింది అలాగే తప్పకుండా యాదవ సోదరుల కోసం మినీ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని తెలిపారు.అనంతరం మంత్రి ని యాదవ సంఘం సభ్యులు శాలువాతో సన్మానించి, జ్ఞాపకను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు కొయ్యడ కిష్టయ్య ,ఓర్రే సదయ్య,బనుక అంజయ్య, మేకల ఓదెలు,శీలం లక్ష్మయ్య, శీలం కొమురయ్య, బుట్టి రాజయ్య,కురుమల్ల కుమార్, చిగురు సూర్యం, మేకల మారుతి పాల్గొన్నారు.