

జనం న్యూస్ మార్చి 18:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలోని తొర్తి గ్రామంలోమంగళవారంరోజునా వీడ్కోల కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులదాసెందర్ మాట్లాడుతూ విద్యార్థలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, మిమ్ములను కన్న తల్లిదండ్రులకు మరియు పాఠశాలకుమంచి పేరు తీసుకరావాలని అన్నారు. పాఠశాలలోని తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్తులు పదవ తరగతి విద్యార్థులకువీడ్కోలు పలికారు.పదవతరగతి పరీక్షల్లోమంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని తొమ్మిదివతరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు చేయడం వలన అక్కడ ఉన్నవారు వారిని చూసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తదితరులు, పాల్గొన్నారు.