Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు అందరికీ, అన్నమయ్య జిల్లా పంచాయతీ అధికారి మస్తాన్ వల్లి ఆధ్వర్యంలో ఇంటిపన్నుల వసూళ్లు, SWPC ల నిర్వహణ, వేసవికాలం త్రాగునీటి సమస్యలపైన రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగినది. త్రాగునీటి సమస్యలు రాకుండా చూడవలెనని ఆదేశించడమైనది. ఏదైనా సమస్యలు ఉన్నయెడల, వెంటనే తెలియజేయాలని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలనికోరారు ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డీ యన్. సునీల్ కుమార్, నందలూరు సర్పంచ్ మోడపోతుల రాము, నాగిరెడ్డిపల్లి పంచాయతీ కార్యదర్శి సురేష్ కుమార్, నందలూరు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, ఇతర పంచాయతీల కార్యదర్శులు అందరూ హాజరవడం జరిగినది.