Listen to this article

జనం న్యూస్ మార్చి 19 ముమ్మిడివరం ప్రతినిధి దారిద్యరేఖకు దిగువనున్న ఆర్యవైశ్యులకు ఉపాధి కల్పించేందుకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం 2024- 2025 సంవత్సరానికి గాను సబ్సిడీతో కూడిన రుణాలను వివిధ వ్యాపారాలను ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందేందుకై ఈనెల 22వ తేదీ లోపు దరఖాస్తులను ఆన్లైన్ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం ఒక ప్రకటనలో తెలిపారు 10వ తరగతి గానీ ఆ పైన ఏదైనా డిగ్రీ చదివి నిరుద్యోగులుగా ఉంటున్న 21 సంవత్సరముల నుండి 60 సంవత్సరములలోపు వారు కులద్రువ పత్రము, ఆదాయ ధూపత్రము, నివాస దృపత్రము రేషన్ కార్డ్ వంటి పత్రాలతో apobmms.apcfss.in ద్వారా ఆన్లైన్ చేసుకోవాలని 1లక్ష
రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు 40% నుండి 50% వరకు సబ్సిడీ రుణాలను అందించడం జరుగుతుందని జనరిక్ మందుల షాపుకై ఎనిమిది లక్షల వరకు కూడా రుణాన్ని కార్పొరేషన్ ద్వారా అందించనున్నట్టు రామం ఒక ప్రకటనలో తెలిపారు కావున యొక్క అవకాశాన్ని ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు