

జనం న్యూస్ 20మార్చి పెగడపల్లి ప్రతినిధి మల్లేశం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ల్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బీసీ, ఎస్సీ రిజర్వేషన్లు అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్ణయం తీసుకున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ భారత్ జోడయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు కామారెడ్డి బహిరంగ సభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని ప్రకటన చేసిన దానికి అనుగుణంగా నిన్న అసెంబ్లీలో అన్ని పార్టీలను సమన్వయం చేస్తూ తీర్మానం చేస్తూ పార్లమెంటు ఆమోదం కొరకు పంపడం జరిగింది. అదేవిధంగా గత 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కొరకు చేస్తున్న పోరాటానికి అనుకూలంగా దేశ అత్యున్నత న్యాయస్థానం 01/08/2024 రోజున రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన వెంటనే నిండు అసెంబ్లీలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసి ఎస్సీ లను ఏ,బి , సి లుగా వర్గీకరణ చేయడం జరిగిందని, యువత కోసం రాజీవ్ యువ వికాస్ పథకం కూడా ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి, మంత్రి దామోదర రాజనరసింహ కి, శ్రీధర్ బాబుకి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కి, సీతక్క కి, ఎంమ్మెల్సీ జీవన్ రెడ్డికి వివిధ హోదాలలో ఉన్న మంత్రులందరికి మరియు సహకరించిన అందరూ శాసనసభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపడం జరిగింది..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు సంధి మల్లారెడ్డి తడగొండ రాజు బండారి శ్రీనివాస్ లింగాపూర్ మాజీ ఎంపీటీసీ పూసాల శోభ తిరుపతి వెంగాళాయిపేట మాజీ ఎంపీటీసీ కడారి సుప్రియ తిరుపతి ల్యగలమర్రి ఎంపిటిసి మందపల్లి అంజయ్య బతికపల్లి మాజీ ఎంపీటీసీ ఎలగొండ కృష్ణ హరి మండల యూత్ అధ్యక్షులు పురుషోత్తం అనిల్ గౌడ్ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి కొండం మధుసూదన్ రెడ్డి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తడగొండ తిరుపతి టౌన్ అధ్యక్షులు చాట్ల ప్రశాంత్ టౌన్ యూత్ అధ్యక్షులు వడ్లూరి ప్రవీణ్ సీనియర్ నాయకులు అమిరిశెట్టి మల్లారెడ్డి చెట్ల కిషన్ గర్వంద రమేష్ గౌడ్ తౌటు గంగాధర్ ధనియాల సురేష్ బాలే అంజయ్య మోదుంపల్లి అంజయ్య దీకొండ మహేందర్ సుంకే దుర్గాప్రసాద్ కుంటాల లక్ష్మి రాజాం చెట్ల రాజు బొమ్మన దయాకర్ సేవాదల్ నాయకులు ఐల్నేని వంశీ యూత్ నాయకులు కుంచ రాజేందర్ కల్లేపల్లి రాజు నీరటి రాజ్ కుమార్ తడగొండ ప్రభుదాస్ సురేష్, తదితరులు పాల్గొన్నారు..