Listen to this article

జనంన్యూస్. 20. నిజామాబాదు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల పరిధిలోని నారాయణ పల్లి గ్రామస్తులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొన్ని రోజుల నుండి పెండింగ్లో ఉన్న హనుమాన్ టెంపుల్ గురించి ఎమ్మెల్యేతో మాట్లాడం జరిగిందని విలేజి కమిటీ వారు తెలిపారు.అలాగే ఈ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ గురించి కూడా ఎమ్మెల్యేతో మాట్లాడినట్టు తెలిపారు.ఎమ్మెల్యే స్థానికులంగా స్పందించి త్వరలోనే నారాయణ పల్లికి వస్తానని మాట ఇచ్చారు. నారాయణ పల్లెలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు భాగంగా నారాయణ పల్లి నుండి మహిపాల్ తాండ వరకు గల రోడ్డు గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు