Listen to this article

జనం న్యూస్, మార్చి 21 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) జగదేవపూర్ మండలం లోని పలుగు గడ్డ గ్రామానికి చెందిన లింగాల అజయ్ కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నా విషయం తెలిసిందే కాగా అదే గ్రామానికి చెందిన పలువురు యువకులు,పెద్దలు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఓదార్చారు,అనంతరం ₹5,000/- రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు మాట్లాడుతూ అజయ్ మృతి చాలా బాధాకరం అని చెప్పారు.బాధిత కుటుంబానికి ఎప్పుడు అవసరం వచ్చినా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాల్ రాజు, బాలయ్య,రామచంద్రం,నర్సింలు,నారాయణ, కనకయ్య,నాగరాజు,కరుణాకర్,కనకయ్య,నర్సింలు,కరుణాకర్, పర్శరాములు,తదితరులు పాల్గొన్నారు.