

మొదటి సారిగా మా రామాలయంకు తలంబ్రాల రాక భక్తితో వడ్లను ఓలిచి రామకోటి రామరాజుకు, అందించారు ఎన్ని జన్మల పుణ్యమో అని ఆనందాన్ని వ్యక్తం చేసిన భక్తులు జనం న్యూస్, మార్చి 21, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భద్రాచల రామయ్య కల్యానానికి తెలంగాణ రాష్ట్రం నుండి 250కిలోల గోటి తలంబ్రాలు అందించాలనే సంకల్ప దీక్షతో గ్రామ, గ్రామాన శ్రీకారం చుట్టింది గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థ. అందులో భాగంగా గురువారం నాడు సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ గ్రామంలోని రామాలయం వద్దకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని గోటితో వడ్లను ఓలిచారు. సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు, చే 3గంటల పాటు రామనామ స్మరణ చేయించి రామనామం గురించి, భద్రాచల గోటి తలంబ్రాల యొక్క పవిత్రత గురించి అందరికీ జెలియజేశారు. భక్తులందరు వడ్లను ఓలిచి అక్కడే రామకోటి రామరాజుకు అందజేశారు. అనంతరం భక్తులు మాట్లాడుతూ మెదటి సారిగా మా రామాలయంకు రావడం మాకు చాలా ఆనందంగా ఉందని ప్రతి సంవత్సరం ఇలాంటి అవకాశం కల్పించాలని భక్తులు రామకోటి రామరాజును కోరారు. మేము భద్రాచలం వెళ్లలేక పోయిన కూడా మేము చేతులతో ఓలిచిన ఈ గోటి తలంబ్రాలు వెళ్లడం ఆనందంగా ఉందని భక్తులు సంతోషాన్ని తెలిపారు.
