

విద్యుత్ లైన్మెన్ విష్ణుకాంత్ పాటిల్ జనం న్యూస్,మార్చ్ 21,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలను తీగలను తొలగిస్తున్న,విద్యుత్ లైన్మెన్ విష్ణుకాంత్ పాటిల్,క్యాజువల్ లేబర్ లాలు,ఈ సందర్భంగా లైన్మెన్ మాట్లాడుతూ రోజురోజుకీ ఎండ తీవ్రత ఎక్కువ అవ్వడంతో ఈదురు గాలులు వియడంతో విద్యుత్తు సరఫరా ట్రాన్స్ఫార్మర్ల వద్ద తీవ్రమైన పిచ్చి మొక్కలు తీగలు పెరగడంతో ఈదురు గాలులు వీచినప్పుడు, ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు తీగలు,గాలి వలన విద్యుత్తు సప్లై తీగలను తగలడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని అన్నారు.విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండడానికై ఈ పెరిగిన పిచ్చి మొక్కలను తీగలను వెను వెంటనే పిచ్చి మొక్కలను తీగలను తొలగిస్తున్నామని అన్నారు.