

జనం న్యూస్ 20 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం డిపో నందు త్వరలో ప్రారంభం కానున్న హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు సంబంధించిన 21వ బ్యాచ్ నందు చేరుటకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనదని డిపో మేనేజర్ శ్రీనివాసరావు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. లైట్ వెహికల్ లైసెన్స్ కలిగి ఒక సంవత్సరం అనుభవం ఉన్న 21 సం. నిండిన వారు ఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్ కు అర్హులు. మొత్తము శిక్షణ 40 రోజుల పాటు వుంటుందన్నారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉపాధి అవకాశాలు మెరుగుపరచు కావాలని అన్నారు. మరిన్ని వివరాలకు 7382924030, 9866649336 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.