Listen to this article

వేములపల్లి ఎస్సై డి వెంకటేశ్వర్లు

జనం న్యూస్ జనవరి 13 వేములపల్లి/

మండల ప్రతినిధి ముత్యాల సురేష్

సంక్రాంతి పండక్కి ఊరు వెళ్తున్నారా ఐతే తస్మాత్ జాగ్రత్త
ఎస్ఐ డి వెంకటేశ్వర్లు వేములపల్లి
ఊరికి వెళ్లే సమయంలో వీలైనంత మేరకు ఇంట్లో విలువైన వస్తువులు,నగదు, బంగారు ఆభరణాలు పెట్టకండి వాటిని బ్యాంకు లాకర్ లో లేదా భద్రత ఉన్నచోట దాచుకోపోవడం ఉత్తమం ఇంటి ముందు తలుపులకు సెంట్రల్ లాక్ వేసి బయట గొల్లం పెట్టకండి ఇంటి తలుపుల ముందు చెప్పులు ఉంచండి బయట గేటుకు లోపల నుండి తాళం వేయండి ఇంటి బీరువాలో ఎట్టి పరిస్థితుల్లో నగదు మరియు బంగారు ఆభరణాలు దాయకండి
మీరు ఊరికి వెళ్లేటప్పుడు మీకు నమ్మకమైన వారికి, స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వండి.
బయటకు వెళ్లేటప్పుడు వాకిట్లో ముగ్గు వేసేటప్పుడు మెడలోని బంగారు ఆభరణాలు జాగ్రత్త.
మీ ఇంట్లో మరియు మీ కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోండి బయట గేటుకు తాళం వేయకండి.
మీ ఏరియా నందు కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు కనిపిస్తే డయల్ 100 కాల్ చేసి సమాచారం ఇవ్వండి.