

8 మంది పై కేసు నమోదు. రెడ్డి ఖానాపూర్ లో పోలీస్ పికెటింగ్… హత్నూర ఎస్ఐ సుభాష్… జనం న్యూస్. మార్చి 21. సంగారెడ్డి జిల్లా. హత్నూర. రెండు కుటుంబాల మధ్య స్థల వివాదంలో గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో 8 మందిపై కేసు నమోదు చేసినట్లు హత్నూర ఎస్ఐ
సుభాష్ తెలిపారు, ఎస్ఐ సుభాష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హత్నూర మండల పరిధిలోని రెడ్డి ఖానాపూర్ గ్రామంలో కుమ్మరి బాలయ్య అనే వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం ఇసుక , డస్ట్, మెటీరియల్ ను మస్కూరి కృష్ణ స్థలంలో పోసుకోవడం కోసం అడగగా ఇద్దరి మధ్య సమన్వయంతో ఇసుక ,డస్ట్, నూ కుమ్మరి బాలయ్య అనే వ్యక్తి, మస్కూరి కృష్ణ స్థలంలో వేశాడు , ఇద్దరు బాగానే ఉండగా , అంతలోనే వారి మధ్య మనస్పర్దాలు రావడంతో మచ్కూరి కృష్ణ, తన స్థలంలో వేసిన ఇసుక డస్ట్ వెంటనే తీసేయాలని కుమ్మరి బాలయ్యకు తెలిపాడు, అంతలో బాలయ్య అతని కుమారుడు కుమ్మరి ప్రశాంత్ వచ్చి మచ్కూరి కృష్ణను ఇక్కడి నుండి వెంటనేఇసుక డస్ట్ తీసేయాలని చెప్పడంతో ఇప్పటికీ ఇప్పుడే ఇసుకను డస్ట్ తీయలేక పోతామని కొద్ది సమయం కావాలని కృష్ణను అడిగాడు. దీంతో మచ్కూరి కృష్ణ నిరాకరించడంతో కుమ్మరి ప్రశాంత్ మస్కూరి కృష్ణకు ఒకరికి ఒకరు పైన మాటలు పెంచుకోవడంతో తీవ్ర దాడులు చేసుకున్నారు, దీంతో గ్రామంలో100 కాల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గ్రామానికి వెళ్లి పోలీసులు నచ్చ చెప్పారు. దీంతో గొడవ సద్దుమనంగా మరుసటి రోజు కుమ్మరి ప్రశాంత్ మస్కురి కృష్ణ మళ్లీ గొడవకు దిగారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసిందని పోలీసులు తెలిపారు. కాగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ సుభాష్ తెలిపారు. ఘర్షణలకు పాల్పడిన 8 మంది పై కేసు నమోదు చేసినట్లు హత్నూర ఎస్ఐ కె. సుభాష్ తెలిపారు,