

జనం న్యూస్ మార్చి 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూచీగా ఉంటారని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం తో పాటు ఎస్సీ వర్గీకరణ చేపట్టిన సందర్భంగా శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని అల్లాపూర్ డివిజన్ లో కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బండి రమేష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేసి తీరుతుందని హామీ ఇచ్చారు.మహిళ, యువజన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వాటిని ఉపయోగించుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు.ఈ సందర్భంగా కార్యకర్తలు రాహుల్ గాంధీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అద్యక్షులు తూము వేణు, డివిజన్ ప్రెసిడెంట్ మోయుజుద్దీన్, విటల్ రెడ్డి, నరసింహ, ప్రకాష్ ముదిరాజ్, జమీర్, నజీర్, నయీమ్, శివ చౌదరి ,రమణ, పల్లపు వేణు, మస్తాన్ రెడ్డి, భరతమా ,రేష్మ తదితరులు పాల్గొన్నారు.