
జనం న్యూస్, జనవరి 13 పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ
విద్యార్థిని విద్యార్థులు అందరూ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని అప్పుడే భారతదేశము అన్ని రంగాలలో పురోభివృద్ధి సాధించగలదని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వైవిఅప్పారావు జాతీయ యువజన నోత్సవాల ముగింపు సమావేశంలో అన్నారు. జాతీయ యువజన ఉత్సవాల సందర్భంగా రెండు రోజులు ఎన్ఎస్ఎస్, ఎన్సిసి మహిళా సాధికారత విభాగం, నెహ్రూ యువ కేంద్ర పశ్చిమగోదావరి జిల్లా మరియు క్రీడా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయ యువజన ఉత్సవాలలో విద్యార్థిని విద్యార్థులకు క్రీడలు అకాడమిక్ పోటీలు,ముగ్గులు మరియు వక్తృత్వ పోటీలు లాంటి అనేక సంప్రదాయక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. యువతరానికి ఆదర్శం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన ఉత్సవాలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ ఉత్సవాల్లో 216 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లోవిజేతలైన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు విద్యార్థిని విద్యార్థులకు నెహ్రూ యువ కేంద్ర మరియు ఎన్ఎస్ఎస్ ముగింపు సమావేశంలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ అధ్యాపకులు పి వై కృపావరం, ఆఫీస్ సూపరింటెండెంట్ సంక్రాత్రి సూర్యనారాయణ, జె.వాసు దేవరావు, ఎన్సిసి అధికారులు జి శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి బాపిరెడ్డి,ఎన్ఎస్ఎస్ అధికారులు టి దివాకర్, ఆర్ ఎన్ శ్రీనివాస్, పి మీరయ్య, మహిళా సాధికారత విభాగ కన్వీనర్ వి.కవితా కుమారి సభ్యులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.