

జనం న్యూస్ మార్చి 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రైల్వే బోర్డు రిక్రూట్మెంట్ ఫలితాలలో మునగాల మండలం విజయరాఘవాపురం గ్రామానికి చెందిన సుంకరి శేషుబాబు ఉద్యోగం సాధించాడు. శేషు ఒకవైపు గ్రామంలో వ్యవసాయ పనులు చూసుకుంటూ, మరోవైపు కోదాడ పట్టణంలోని గ్రంధాలయానికి వెళ్లి చదువుకుంటూ ఉద్యోగ సాధనలో విజయం సాధించి గ్రామీణ యువతకు ఆదర్శంగా నిలిచాడు. ఈ సందర్భంగా శేషు బాబును శుక్రవారం గ్రామానికి చెందిన బంధువులు, గ్రామానికి చెందిన పలువురు ఉద్యోగస్తులు, గ్రామానికి చెందిన పలువురు మిత్రులు, అభినందించారు.