Listen to this article

జనం న్యూస్ // మార్చ్ // 21 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. శాతవాహన యూనివర్సిటీ నిన్న ప్రకటించిన ఒకటవ, మూడవ, ఐదవ, సెమిస్టరు ఫలితాలలో గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు డివిజన్ స్థాయిలో లో మంచి ఫలితాలను సాధించడం జరిగింది. బిజడ్సీ విభాగానికి సంబంధించి సకినపల్లి జ్యోతి 8.7జీపీఏ డివిజన్ మొదటి స్థానంలో నిలవడం జరిగినది అదేవిధంగా బీకాం విభాగానికి సంబంధించి 8.73జీపీఏ ఎంపీసీస్ విభాగానికి సంబంధించి 8.5 జీపీ ఏ అదేవిధంగా బీకాం విభాగానికి సంబంధించి 8.4 జీపీ ఏ 8.0జి పీ ఏ తో పాటుగా అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించడం జరిగినది అని ప్రిన్సిపల్ సర్దన కుమారస్వామి తెలియజేశారు.అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థులకు సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధించడం మా ప్రత్యేకత అని కేవలం ఫీజు రియంబర్స్మెంట్ తో ఉచిత విద్యను అందిస్తున్నటువంటి కళాశాల మాది అని దీనిని జమ్మికుంట పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమ సమావేశంలో కరస్పాండెంట్ ముష్క వీర రాజు, అధ్యాపకులు రాగ అంజిబాబు, రమేష్,చంద్రయ్య, కరుణ, సాగర్, మధుకర్, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.