

మునగాల మండలంలోని రైతులు పండించిన పంటలను పంట చేనులో మాత్రమే అరబోసుకోవాలని ఎస్సై ప్రవీణ్ కుమార్ సూచించారు. జనం న్యూస్ మార్చి 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయొద్దని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. రోడ్లపై ధాన్యాన్ని ఆరబోయడం మూలంగా వాహన ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. రైతులు పండించిన తమ ధాన్యాన్ని కళ్ళల్లోనే ఆరబోసుకోవాలని,రోడ్లపై ఆరబోసి ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వద్దన్నారు. ధాన్యం ఆరబోయడం వల్ల వాహనదారులకు ఇబ్బందిగా మారుతోందన్నారు. వాహనాదారులు అదుపు తప్పి పడి ప్రమాదాలకు గురవుతున్నారని పారు.రహదారులపై ఆరబోస్తున్న ధాన్యం రాత్రి వేళలో కనపడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.రోడ్లపై ధాన్యాన్ని ఆరబోస్తే తగు చర్యలు తీసుకుంటామని రైతులకు సూచించారు.ఈ విషయాన్ని రైతులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు.