చిన్నారి చరణ్యను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

May 30, 2026 | తెలంగాణ

జనం న్యూస్ మే 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామ ఉపసర్పంచ్, వార్డు మెంబర్ తుడుం స్రవంతి రాజు దంపతుల కూతురు చిన్నారి చరణ్య సారీ ఫంక్షన్ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చిన్నారిని ఆశీర్వదించి, పట్టుచీర బహూకరించారు.చిన్నారి చరణ్య భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆడపిల్లలను చదివించడం, సంస్కారంగా పెంచడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. చరణ్య మంచి సంస్కారవంతురాలిగా ఎదగాలని కోరుకుంటున్నా అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి వార్డ్ మెంబర్లు రమేష్, రాజు, మహేందర్, నాయకులు ప్రవీణ్, శ్రావణ్, వెంకటేశ్వర్లు, గంట శ్యాంసుందర్ రెడ్డి, మారెపల్లి నందం, బండ నారాయణరెడ్డి, వైద్యుల తిరుపతిరెడ్డి, పెద్దిరెడ్డి ఆదిరెడ్డి, అంకేశ్వరపు మొగిలి,బండ రజనీకర్ రెడ్డి, పోతుగంటి సాంబరాజు నాయకులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. అనంతరం చరణ్య కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper