

ఆటోల్లో పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్న విద్యార్థులు.. జనం న్యూస్ // మార్చ్ // 21 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పదవ తరగతి విద్యార్ధులకు చొక్కారపు శ్రీనివాస్ జ్ఞాపకార్ధం, తన కుమారుడు ( చింటు ) పరీక్ష సెంటర్ల వద్దకు ఉచిత రవాణ సౌకర్యం కల్పించారు. శుక్రవారం వివిధ ప్రాంతాల నుండి సుమారు వంద మంది విద్యార్ధులను మూడు ప్యాసింజర్ ఆటోల ద్వార పరీక్ష కేంద్రాల వద్దకు తరలించారు. ఆటోల్లో పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్న విధ్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంధర్బంగా చింటు మాట్లాడుతూ…తన తండ్రి జ్ఞాపకార్ధం పరీక్షలు పూర్తి అయ్యేంత వరకు ఉచిత రవాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని విధ్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మొలుగు దిలీప్, తదితరులు పాల్గొన్నారు.