Listen to this article

జనం న్యూస్ మార్చ్ 22 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని రోజువారి సంత ,వారాంతపు సంత ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయం సమకూర్చే లక్ష్యంతో పంచాయతీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం గ్రామ పంచాయతీ ఆవరణలో తైబజార్ వసూలుకు వేలం పాట నిర్వహించి ఆదాయాన్ని రాబట్టారు .వేలం పాటలో ఎనిమిది మంది డిపాజిట్ సొమ్ము చెల్లించి పోటీ పడగా వారాంతపు సంత కోసం 3 లక్షల 33 వేల రూపాయలు, రోజువారి సంత కోసం 2 లక్షల 3 వేలకు పాట పాడి ఒకరు దక్కించుకున్నారు .ఈ వేలం పాట కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు పంచాయతీ కార్యదర్శి గూడ రమేష్ ,కారొబార్ గాండ్ల సిద్ధరాములు ,మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు సుతారి రమేష్ ,బీజేపీ నాయకులు బి .రంజిత్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ సారి ఆశించిన దానికన్నా ఎక్కువ పాట పాడి పంచాయతీకి ఆదాయం సంతృప్తికరంగా ఉందని పలువురు వ్యాఖ్యానించారు .