Listen to this article

జనం న్యూస్ 22 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈడీ, డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు విజయనగరంలోని అంబటిసత్రం వద్ద శ్రీవెంకటరత్నం మెడికల్‌, జనరల్‌ స్టోర్‌లో శుక్రవారం రాత్రి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా గడువు ముగిసిన టబౌషధాలు, నిషేధిత మత్తు కలిగించే టానిక్‌లు స్వాధీనం చేసుకున్నామని విజిలెన్స్‌ 3 బర్ల ప్రసాద్‌ వెల్లడించారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మెడికల్‌ షాపుల్లో దొరికే కొన్ని మందులను డ్రగ్స్‌గా వినియోగిస్తున్నారని తెలిపారు.