Listen to this article

జనం న్యూస్ 22 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసుశాఖలోని ట్రాఫిక్ కానిస్టేబులుగా పని చేస్తూ, ఇటీవల పంజాబు రాష్ట్రం జలంధర్లో జరిగిన 1వ ఆల్ ఇండియా పోలీసు కబడ్డీ క్లస్టరు 2024-25 పోటీల్లో కాంస్య పతకం సాధించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మార్చి 21న తెలిపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – జిల్లా పోలీసుశాఖ ట్రాఫిక్ పోలీసు స్టేషనులో కానిస్టేబులుగా పని చేస్తున్న బి.ఎస్.ఎన్. మూర్తి ఇటీవల పంజాబ్ రాష్ట్రం జలంధర్ జరిగిన 1వ ఆల్ ఇండియా పోలీసు కబడ్డీ క్లస్టరు 2024-25 పోటీల్లో పాల్గొన్న రాష్ట్ర పోలీసు విభాగం తరుపున పాల్గొన్నారన్నారు. ఈ పోటీలు జలంధర్ పోలీసు హెడ్ క్వార్టర్సులో మార్చి 2 నుండి 6వరకు జరిగాయన్నారు. ఈ జాతీయ పోటీల్లో కబడ్డీ, జిమ్మాస్టిక్స్, ఖోఖో, ఫెన్సింగు విభాగాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసు జట్లు పాల్గొన్నాయన్నారు. జిల్లాకు చెందిన బి.ఎస్.ఎన్. మూర్తి ఫెన్సింగ్ విభాగంలోని సీనియర్స్ ఫోయిల్స్ లో రాష్ట్ర పోలీసు జట్టు తరుపున పాల్గొని కాంస్య పతకం సాధించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
జాతీయ స్థాయిలో ఫెన్సింగు విభాగంలో కాంస్య పతకం సాధించిన బి.ఎస్.ఎన్.మూర్తి జిల్లా ఎస్పీ వకుల్
జిందల్ గార్ని జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా, కానిస్టేబులు మూర్తిని జిల్లా ఎస్పీ
అభినందించి, క్రీడా ప్రతిభను ప్రశంసించారు. జాతీయ స్థాయిలో కాంస్య పతకం సాధించిన కానిస్టేబులు మూర్తిని రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా మంగళగిరిలోని రాష్ట్ర డిజిపి కార్యాలయంలో అభినందించారు. పతకాలు సాధించిన పోలీసు సిబ్బందికి త్వరలో ప్రోత్సాహక నగదు బహుమతిని, అదనంగా వార్షిక ఇంక్రిమెంటు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వు ఇన్స్పెక్టరు ఎన్. గోపాల నాయుడు, ట్రాఫిక్ సిఐ సూరి నాయుడు, ఎస్బీ సిఐ ఎవి లీలారావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.