Listen to this article

అచ్యుతాపురం(జనం న్యూస్):ఎలమంచిలి మండలం జంపపాలెం గ్రామంలో జిల్లాస్థాయి గుర్రపు పరుగు పోటీలను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్,ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చైర్పర్సన్ రమా కుమారి,దాడి రత్నాకర్ ప్రారంభించారు.సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఈ పోటీలకుఉమ్మడి జిల్లాల నుంచి 17 గుర్రపు జట్లు హాజరు కాగా రసవత్తరంగా సాగుతున్న గుర్రపు పరుగు పోటీలను చూసేందుకు అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన, టిడిపి,బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.