

రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు
జనం న్యూస్ జనవరి 13 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ :
ప్రతిభ ఉన్న క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తామని, విశ్వహిందు ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు. దేవీపట్నం మండలం పెద్దభీంపల్లి గ్రామం ఆర్అండ్ ఆర్ కాలనీ వద్ద సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఏజెన్సీ క్రికెట్ మండల లెవెల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంబాల శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లో ప్రతిభ కనబరచాలని, క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు. ముంపు గిరిజన గ్రామాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారం అందిస్తానన్నారు. యువతకి ఏ అవసరం వచ్చిన తన వద్దకు వస్తే సహాయం చేస్తానన్నారు. ఈ సంక్రాంతి పండగ ప్రతి ఒక్కరు ఆనందంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం టోర్నమెంట్ లో గెలుపొందిన . విన్నర్స్ కు పదివేలు, రన్నర్స్ కు ఐదువేలు రూపాయలు నగదును బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవిపట్నం ఎస్ఐ కే షరీఫ్, రామసేన సభ్యులు మామిడి అయ్యప్ప, ఇనకోటి బాపన్న దొర, తామర్ల రాంబాబు, వరసాల ప్రసాద్, డాక్టర్ వల్లూరి జగన్నాథ రావు శర్మ, కట్టా కళ్యాణ్, దాసరి ధర్మరాజు, జనసేన మండల అధ్యక్షులు రాయుడు, గ్రామస్తులు యువత, తదితరులు పాల్గొన్నారు..