Listen to this article

జనం న్యూస్ జనవరి 13 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సబ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో ఆధార్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు నిర్మల్ సబ్ డివిజన్ తపాలా అధికారి సందీప్ తెలిపారు. ప్రజల సేవలో భాగంగా ఆధార్ కార్డులో ఏమైనా తప్పు ఒప్పులు ఉన్న ఫోన్ నెంబర్లు. మరియు పేర్లు తప్పు ఉన్న ఏదైనా సరి చేసుకోవచ్చని తెలిపారు. ఇవే కాకుండా తపాలా కార్యాలయంలో పొదుపు ఫిక్స్ డిపాజిట్లు. పొదుపు పథకాలు. రికార్డింగ్ డిజిటల్ పథకాలు వివిధ రకాల సేవల కోసం పోస్ట్ ఆఫీస్ ను సంప్రదించి వారి యొక్క సేవలను వినియోగించుకోవాల్సిందిగా తెలపడం అయినది. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ సబ్ పోస్ట్మాస్టర్ నవీన్ పోస్టల్ అసిస్టెంట్ శ్రీకాంత్ పోస్ట్ మెన్ రంజిత్ కుమార్ పోస్టల్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.