Listen to this article

జనం న్యూస్ మార్చి 23 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని హైదర్ నగర్ డివిజన్లో రామ్ నరేష్ నగర్ మాజీ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి యాబై మంది కార్యకర్తలు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ గండవ కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వరకు అబద్దాలతో పబ్బం గడుపుకుంటున్నారని ప్రజలకు చేసే అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలలో మొండిచే చూపుతున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బడ్జెట్ ప్రవేశంలో సంక్షేమ పథకాల జాడలేదని ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినట్టుగా బడ్జెట్ తయారుచేసారని సాక్షాత్తు అసెంబ్లీలోనే తుమ్మల నాగేశ్వరరావు రెండు లక్షల పైగా రుణమాఫీ చేయమని చెప్పడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే అన్నారు. అబద్ధపు హామీలతో సర్కారును ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పుతారు. మళ్లీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్న తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, బిఆర్ఎస్ నాయకులు కలీం, శ్రీకాంత్, నక్క శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీలో చేరినవారు వెంకటయ్య, అర్జున్ రెడ్డి, డి రాము, మహేష్, ప్రతాప్ రెడ్డి చిట్టిబాబు, రాములు గౌడ్, మహేందర్, నరసింహ, రవీందర్, నారాయణ రెడ్డి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు