Listen to this article

జనం న్యూస్. మార్చి 23. సంగారెడ్డి జిల్లా. హత్నూర.

హత్నూర మండలంలోని దౌల్తాబాద్ చౌరస్తా వద్ద బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు నాగప్రభు గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాగప్రభు గౌడ్ మాట్లాడుతూ మెదక్ ఎంపీ జన్మదినం సందర్బంగా పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకు తన సొంత నిధులతో ఏడు అంబులెన్సులు కేటాయించి దాతృత్వన్ని చటుకున్నారని తెలిపారు. ప్రతి కార్యకర్త కష్టసుఖాల్లో తోడుంటూ ఎల్లప్పుడు ప్రజాసేవలో ముందుంటూ అనునిత్యం ప్రజల పక్షాన గర్జించే నాయకుడు మెదక్ ఎంపీ రఘునందన్ రావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు బిట్ల మహేష్.మండల నాయకులు శ్రీశైలం. కోలనిరవి. కమలాకర్. శ్రీకాంత్. పాండు. మల్లేష్. కుమార్. గణేష్. నాగరాజు గౌడ్. సాయిరాం. శేఖర్. వెంకటేష్. రమేష్. తదితరులు పాల్గొన్నారు