

బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోకండి.
ఐపీఎల్ క్రికెట్ సందర్భంగా యువత, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.
సెలవుల దృష్ట్యా తల్లిదండ్రులు పిల్లల పై నిఘా ఉంచాలి.
.కె.నరసింహ ఐపిఎస్, ఎస్పీ సూర్యాపేట జిల్లా
జనం న్యూస్ మార్చి 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
ఐపీఎల్ క్రికెట్ సీజన్ సందర్భంగా యువత, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపినారు. ఎవ్వరూ కూడా క్రికెట్ బెట్టింగ్ లు పెట్టవద్దు అని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు. బెట్టింగ్ లు పెట్టడం ఒక చెడు వ్యసనము, ఇది నేరము. బెట్టింగ్ లకు అలవాటు పడితే ఆర్థికంగా నష్టపోతారు ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలు రోడ్డు పాలు చేస్తున్నారు అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడితే మళ్ళీ కోలుకోవడం కష్టం అవుతుంది, బెట్టింగ్ ముఠాల నుండి బెదిరింపు వస్తాయి, జీవితం విచ్ఛిన్నం అవుతుంది అని తెలిపినారు. ఐసీసీ నిర్వహించే మ్యాచులు క్రికెట్ ఆట అయితే ఈ ఐపీఎల్ అనేది బెట్టింగ్ తిమింగలాలు నిర్వహించే ఒక వ్యాపారం అన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి అయి విద్యార్థులు సెలవుల దృష్ట్యా ఖాలీగా అంటారు, ఒక్క పూట బడులు వల్ల సెలవుల ఉన్నాయి, కావున తల్లిదండ్రులు పిల్లల పై దృష్టి పెట్టాలి, వారికి అవసరానికి మించి డబ్బులు సమకూర్చవద్దు అని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు..ఈ మ్యాచులు ప్రారంభం అయ్యాక మీ పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పులు కనబడితే వెంటనే తగిన చర్యలు తీసుకోండి.లేదంటే డబ్బులు, ప్రాణాలు రెండు పోయే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ చేయడం చట్టరీత్యా నేరం. ఎవరైనా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లకు బెట్టింగ్ కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకొనబడతాయి. ఎవరైనా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లకు బెట్టింగ్ కు పాల్పడితే పోలీస్ వారికీ సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు…