ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపునివ్వాలి

June 1, 2026 | తెలంగాణ

ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి డాక్టర్ పిడమర్తి రవి

జనం న్యూస్ 01-06-2026 నేడు జహీరాబాద్ కు విచ్చేసిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమకారులు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి తెలంగాణ ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపును ఇచ్చి ప్రభుత్వం ప్రకటించిన 250 గజాల స్థలం వెంటనే ఇయ్యాలని ఉద్యమకారులు ఏ రకంగా ఉద్యమించిన కూడా వారిని గుర్తించాలని ఉద్యమకారుల్లో ఉన్న కొన్ని రకాల సందేహాలను తీర్చినారు ఉద్యమకారులు కొంతమంది జైలుకు వెళ్లిన వారున్నారు కొంతమంది తరచుగా అరెస్టులకు గురైన వారు ఉన్నారు అలాంటి వారిని అందరిని కూడా గుర్తించి నియోజకవర్గాల వారీగా ఉద్యమకారులకు ప్రభుత్వం ప్రకటించిన 250 గజాల స్థలం ను వెంటనే ఇవ్వాలని ఉద్యమకారుల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడినారు ఈ సమావేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమకారులు ఉపాధ్యాయులు రామచందర్ భీమ్ వంశీ రిటైర్డ్ తాసిల్దార్ గడ్డం జనార్ధన్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులు పి.రాములు నేత ఉపాధ్యాయులు జనార్దన్ రెడ్డి నారాయణరెడ్డి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి మోహిన్ టి ఎల్ ఎఫ్ నాయకులు డా.మదిరే సిద్ధన్న న్యాయవాదికారదాసు పవన్ ఉపాధ్యాయులు సంజీవ్ గౌడ్ ఉపాధ్యాయులు జీవన్ ఉద్యమకారులు మహమ్మద్ ఇమ్రాన్ పేర్ల దశది అరవింద్ బాలు ఉపాధ్యాయులు జనార్దన్ రెడ్డి రిటైర్డ్ ఉపాధ్యాయులు పద్మ రమేష్ మొదలగు ఉద్యమకారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు

🌐 Select Language:
📰 ePaper