Listen to this article

జనం న్యూస్ మార్చి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు తెలంగాణా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఎస్ ఎఫ్ ఐ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు బుధవారం రోజున ఎస్ ఎఫ్ ఐ మండల అధ్యక్షులు ఎండి ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సంవత్సరం నార అవుతుంది ఇప్పటివరకు విద్యారంగ సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు విద్యారంగానికి అతి తక్కువ నిధులు మంజూరు చేసి విద్యారంగాన్ని బ్రష్టు పట్టిచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన ఉందన్నారు రాష్ట్రంలో 7,200 కోట్ల స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్య సంస్థల్లో విద్యార్థులకు సరైన మోలిక సదుపాయాలను కల్పించాలన్నారు లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని. హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ మండల అధ్యక్షులు ఎండి ఇస్మాయిల్ సాయి కుమార్ అఖిల్ కన్నా రావు మంద అజయ్ సందీప్ తదితరులు పాల్గొన్నారు….