

చేగుంట జనవరి 14 (ప్రజా శంఖారావం ) మెదక్ జిల్లా చేగుంట మండల పట్టణ కేంద్రంలో గల పోలీస్ స్టేషన్లో రామాయం పేట సీఐ వెంకట రాజా గౌడ్, చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రజా శంకరావం క్యాలెండర్ ఆవిష్కరించబడింది. ఈ సందర్భంగా సిఐ వెంకట రాజ గౌడ్ మాట్లాడుతూ ప్రజా శంఖారావం పత్రిక ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ముందు ఉంటుందని అన్నారు. నిజాలను నిర్భయంగా రాసే పత్రికలను ప్రజలు ఎల్లప్పుడూ ఆదరిస్తారని అన్నారు. అలాగే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి జర్నలిస్టులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రామయంపేట సిఐ వెంకట రాజా గౌడ్, చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి, ప్రకాష్, అన్నం మహేష్, నాగరాజు, సతీష్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.