

జనం న్యూస్ మార్చి 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
ఈరోజు కెపిహెచ్బి కాలనీ ముడవవ ఫేస్ మంజీరా మాల్ ప్రక్కన గల శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం నందు అఖిల భారత రామ్ చరణ్ యువత నిర్వాహకులు సందీప్ ధనపాల్ అరవింద్ చెర్రీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగ కూకట్‌పల్లి నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ప్రత్యేక అతిథిగా ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు మరియు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మేనేజర్ రవణం స్వామి నాయుడు విచ్చేసి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతు మెగాస్టార్ చిరంజీవి రక్త దానం మరియు నేత్రదారం ద్వారా ఇతరులకి ప్రాణదానం చేయవచ్చని సేవా దృక్పథంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ని ప్రారంభించారని , ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం వలన ఇతరులకు ప్రాణం పోసిన వారవుతారని , ప్రపంచంలోనే తయారు కాని వస్తువు ఏదైనా ఉందంటే అది కేవలం రక్తం మే అన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నలబై వ పుట్టినరోజు సందర్భంగ చిరంజీవి స్ఫూర్తితో రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన యువకులు సందీప్, అరవింద్ లను అభినందించి, రక్త దానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గం జనసేన నాయకులు కొల్లా శంకర్, భోగాది వెంకటేశ్వరరావు, కలిగినిడి ప్రసాద్ , పులగం సుబ్బు , యాళ్ళ శిరీష మరియు మెగా అభిమానులు ఊచా రాంబాబు భుట్టో నూతి రాంబాబు ,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు .