

జనం న్యూస్ మార్చి 27 కాట్రేనికోన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండల పరిషత్ ఎంపీపీగా కోలాటి సత్యవేణి ని ఎన్నుకున్నారు. ప్రత్యేక అధికారి వెంకట్రావు ఈమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం చేతులు పైకి ఎత్తడం ద్వారా ఎంపీపీ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నేల కిషోర్ తాత్కాలిక ఎంపీపీ ఏడిద అరుణ ,అక్కల శ్రీధర్ మోక చంద్ర నాగరత్నం ఎస్ నాగేశ్వరరావు ,విత్తనా రాణి , ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అమలాపురం డిఎస్పి టి ఎస్ ఆర్ కే ప్రసాద్ ఆధ్వర్యంలో ముమ్మిడివరం సిఐ మోహన్ కుమార్ పర్యవేక్షణలోకాట్రేనికోన ఎస్ఐ అవినాష్ మరియు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
