

జనం న్యూస్ // మార్చ్ // 27 // జమ్మికుంట // కుమార్ యాదవ్..
జమ్మికుంట పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని, దారు సలాం మజీద్ లో ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పవిత్ర ఉపవాసం ఉన్నవారికి, హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన అనుమాస రాజేందర్, శ్రీపతి నరేష్ మాజీ కౌన్సిలర్ ఆధ్వర్యంలో, ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. అనంతరం మజీద్ అధ్యక్షులు యాకూబ్ పాషా. తాజ్ పాషా. ఎండి బషీర్. ఇమామ్ మొలి. సాధిక్ భాష. అబ్దుల్ మోయిన్. కాలిని ముస్లిం సోదరులు ఆధ్వర్యంలో అనుమాస రాజేందర్ ని మరియు శ్రీపతి నరేష్ స్వర్ణలత దంపతులను సన్మానించారు.
